తెలంగాణ కాంగ్రెస్‌లో డిన్నర్ మీటింగ్ రగడ చిరిగి చాటంత అయి చాపంత అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్‌పై అధిష్టానం ఫోకస్ పెట్టింది. మీటింగ్ క్యా హై..! మీటింగ్ కే పీఛే క్యా హై..! అంటూ ఢిల్లీ నుంచి సౌండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన ఈ అంశం- ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం అంశం పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ దగ్గరకు చేరింది. హైదరాబాద్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలకు PCC ఫోన్లు చేసింది. ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు వచ్చినా మీడియా ముందు ఎమ్మెల్యేలు మాట్లాడటం పట్ల అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఎక్కడా మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు దీపాదాస్ ఆదేశాలు జారీర చేశారు.
ఈనెల ఐదోతేదీన తాను రాష్ట్రానికి వస్తానని దీపాదాస్‌క చెప్పినట్లు సమాచారం. మొన్నటి సమీక్షలో ఎమ్మెల్యేల రహస్య సమావేశం అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు గ్యాప్ ఉండొద్దని సీఎం అన్నట్లు సమాచారం. తాజాగా దీపాదాస్ మున్షీ దగ్గరకు పంచాయతీ చేరడంతో అధిష్టానం అడుగులు ఆసక్తిగా మారాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో 8 మంది ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ హస్తపార్టీలో కలకలం రేపింది. ఓ మంత్రికి వ్యతిరేకంగా 8మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, భూపతిరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కె.రాజేష్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల భేటీ విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారికి ఫోన్ చేసి మాట్లాడారు. తాము హోటల్‌లో డిన్నర్ మీటింగ్‌కు వెళ్లింది నిజమేనని ఆ 8మంది ఎమ్మెల్యేలు సీఎంకు, పీసీసీ చీఫ్‌కు ధ్రువీకరించారు. త్వరలోనే రాష్ట్ర అధిష్టానాన్ని కలుస్తామన్నారు ఎమ్మెల్యేలు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలపై అక్కడి ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలని మంత్రులకు సూచించారు.