రైలు ప్రమాదానికి చేసిన కుట్ర భగ్నం.. ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు గుర్తించిన లోకో పైలట్‌..ఎక్కడంటే..

2 hours ago 2

లోకో పైలట్‌ అప్రమత్తతో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని భటిండాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డజను ఇనుప రాడ్‌లను పెట్టి వెళ్లారు. అయితే, రైలు లోకో పైలట్‌ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. ఈ ఇనుప రాడ్‌ల‌ను గ‌మ‌నించిన గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. వెంట‌నే సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బటిండా-ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా గూడ్స్ వెళ్తోంది. భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా ఒక గూడ్స్ రైలు ప్ర‌యాణిస్తోంది. అయితే ఎవ‌రో కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచి రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు దుండగులు. అయితే, రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ అందలేదు. దీంతో, ట్రైన్ చాలా ఆలస్యమైంది అని ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు. ట్రాక్ పై పెట్టిన ఇనుప రాడ్లను లోకో పైలెట్ ముందుగా గుర్తించి సకాలంలో బ్రేకులు వేసి ట్రైన్ ఆపాడు. దీంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. రైల్వే ట్రాక్‌పై ఐరన్‌ రాడ్లు ఉండడంతో రైలు ప్రమాదం తప్పినప్పటికీ, బటిండాకు వచ్చే గూడ్స్ రైలును 45 నిమిషాల పాటు నిలిపి వేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

#WATCH | Bathinda, Punjab: Iron rods were recovered from the Bathinda-Delhi railway way successful Bathinda yesterday

“…9 robust rods person been recovered from the spot. GRP (Government Railway Police) has registered a lawsuit against an chartless idiosyncratic and further probe is being… pic.twitter.com/2FerTtAqrO

— ANI (@ANI) September 23, 2024

ఇదిలా ఉంటే, గత ఆగస్టు నెల నుంచి దేశవ్యాప్తంగా 18 సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు, టెలికాం స్తంభాలు, డిటోనేటర్లు వంటి వస్తువులు కనిపించాయని పేర్కొన్నారు. ఇది కేవలం రైల్వే శాఖకు మాత్రమే కాదు.. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసే అంశంగా వారు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article