ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు ఈ మూవీ గురించి హీరో విశ్వక్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాను విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అంటే.. ఆ హీరో ఫంక్షన్ కు ఎందుకు వెళ్తున్నావని కొందరన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు చిరు. విశ్వక్ ఎప్పుడూ అవతలి వాళ్లు అంటే బాలకృష్ణ, తారక్ అంటాడు కదా… అలాంటి హీరో ఫంక్షన్ కు వెళ్తావా అని తనను అడిగారన్నారు. బాలయ్య, తారక్ మీద ఆయనకు ఇష్టముంటే.. తన మీద ప్రేమ ఉండకూడదా అని వాళ్లను అడిగా అన్నారు చిరు. ఇక తమ ఇంట్లో అబ్బాయికి సూర్య అంటే ఇష్టమని.. అలాగని తాము కలిసి భోజనం చేయట్లేదా… ఇదీ అంతే అంటూ చెప్పారు చిరు. ఇండస్ట్రీలో హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకునేవాళ్ళు. కాని అలా కాదని చెప్పారు చిరు. హీరోల మధ్య సఖ్యత కోసం ఇండస్ట్రీకి తాను హీరోగా మారిన తరువాత ఏం చేశావారో చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు