కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఎన్నికలు, ట్రంప్ విజయం వంటి చాలా కారణాలు ఇప్పుడు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. సరికొత్త రికార్డ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు రూ. 77,450 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84 వేల 490 వద్దే కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 77, 440లు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,480గా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దిగవస్తాయని అంతా అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోడవంతో బంగారం ధరల్లో ఏ మార్పు కనిపించలేదని చెప్పవచ్చు. బంగారంతో పాటుగా వెండి రేట్లు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు వరుసగా మూడో రోజూ స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 1,07,000 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jio: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసిన జియో
ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్ చేస్తే సొల్యూషన్..