వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. పోలీసులు వివిధ క్రీడల్లో పోటీ పడుతూ రిలాక్స్ అవుతున్నారు. అదును చూసి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరంగల్‌లోని గిర్మాజీపేట రాములవారివీధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. శుక్రవారం(జనవరి 18) మధ్యాహ్నం లక్ష్మీ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె మెడలో నుండి గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి పుస్తెల తాడు తెంచుకెళ్ళాడు. బాధితురాలి అరుపులు విని అతన్ని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
వరంగల్ లోని జేపీఎన్ రోడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ మహిళ గ్రూపు మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తోంది. ఈక్రమంలో అక్కడ మాటు వేసిన చైన్ స్నాచర్ బైక్ పై వచ్చి మెడలోని పుస్తేలతాడు లాక్కెళ్ళాడు. సుమారు రెండున్నర తులాల బరువున్న బంగారు పుస్తెలతాడు చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..