అంతర్గత కలహాలతో మోహన్‌బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈనేపథ్యంలో మంచు మనోజ్ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు? అంటూ రాసుకొచ్చారు. నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందామంటూ పోస్ట్ చేశారు. అయితే తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్‌గా ఎక్కడా చెప్పలేదు. మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్… ఎవరిని పిలుస్తున్నారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. టీవీ9 రిపోర్టర్‌పై దాడి వ్యవహారంలో..మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అయితే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో సంక్రాంతి వేళ..మరోసారి వివాదం మొదలైంది. పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈ వ్యవహారం కూడా కేసుల వరకూ వెళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు బ్రదర్స్ ట్వీట్స్..మరోసారి వైరల్‌గా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
తెలుగు స్టేట్స్‌లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. తాను నటించిన “రౌడీ” మూవీలోని ఓ డైలాగ్ ఆడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన మంచు విష్ణు..తన ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటన్నారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి..అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్‌ను మంచు విష్ణు పోస్ట్ చేశారు. విష్ణు పోస్టు పెట్టిన గంటల్లోనే దానికి కౌంటర్ అన్నట్లుగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు..ఆయన సోదరుడు మంచు మనోజ్. కృష్ణంరాజు నటించిన తాండ్రపాపారాయుడు, భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను షేర్ చేస్తూ.. మనోజ్ ట్వీట్ చేశారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజులాగా..సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని మంచు మనోజ్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా..#VisMith అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి.. అతడి హాలీవుడ్ ప్రాజెక్టు అనేది క్లూ అని చెప్పారు..మనోజ్.
#VisMith u r excessively cute… let’s beryllium and talk, Man to Man. keeping women, Dad, unit and sweetener retired of this. What accidental ?!
Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I committedness I volition travel alone, u tin get whomever you privation oregon we tin person an unfastened and steadfast statement 🙌🏽❤️
Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..