యాక్షన్ హీరో విశాల్ పేరు ఈ మధ్య వార్తల్లో తెగ వైరల్ అయ్యింది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడు ఫిట్ గా యాక్టివ్ గా కనిపించే విశాల్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో అనారోగ్యంగా చాలా బలహీనంగా కనిపించారు. అలాగే ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు వణుకుతూ కనిపించాయి. దాంతో విశాల్ ఆరోగ్యం పై రకరకాల వదంతులు వినిపించాయి. కొందరు ఆయనకు ఏమైంది అని ఆరాతీసారు. కాగా విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఆయనకు డెంగ్యూ జ్వరం అని పలువురు తెలిపారు. ఇప్పుడు విశాల్ జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైన విశాల్ తన అనారోగ్యం పై కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
విశాల్ నటించిన మగధరాజా సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు కుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సినిమా అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తిరిగి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
ఈ సినిమాలో విశాల్ కు జోడీగా వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి నటించారు. ఇన్నేళ్ల తర్వాత విదులైన తర్వాత కూడా మగధరాజా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. తమిళ్ లో ఈ సినిమా పొంగల్ కానుకగా విడుదలైంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మాట్లాడుతూ చెయ్యి వణుకుతుంది. మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వదుగా అంటూ పంచ్ వేశాడు. ఆ తర్వాత విశాల్ నార్మల్ గా మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలు స్పందిస్తున్నారు. తనను ట్రోల్ చేసే వారికి విశాల్ అదిరిపోయే పంచ్ వేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి