మీరు తరచూ ట్రైన్‌లో లాంగ్ జర్నీ చేస్తుంటారా.? ఆకలి వేస్తే టిఫిన్, మీల్స్ కోసం.. భోగీలు తిరిగే వెండర్స్ కోసం ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏ బాధ లేకుండా కేవలం ఓ చిన్న వాట్సాప్ నెంబర్‌తో మీకిష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. ఒక్క ఫుడ్ మాత్రమే కాదు.. ఏదైనా ఆరోగ్యకరంగా ఇబ్బంది ఎదురైనా.. డాక్టర్‌ను ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా పిలవవచ్చు. ఆ నెంబర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
9881193322:
మీరు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చ్చేసుకోవచ్చు. మీరు రైలు PNR స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే రైలు లైవ్ స్టేటస్ కూడా చూడవచ్చు. అంతేకాదు రైలు షెడ్యూల్ లాంటివి కూడా ఈ నెంబర్‌తో చెక్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
8750001323:
రైలులో మీకు ఆకలి వేస్తే.. మీ సీటులో కూర్చొని మీకిష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా పైన పేర్కొన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
138:
మీరు లేదా ఇతరులు రైలులో అనారోగ్యానికి గురైతే, మీరు ఈ నెంబర్ ద్వారా వైద్య సేవలను పొందవచ్చు. తదుపరి స్టేషన్‌లో మీకోసం వైద్యుల బృందం వేచి ఉంటుంది.
ఎలా చేయాలంటే..
ఈ నెంబర్లు సేవ్ చేసిన తర్వాత, మీరు వాట్సాప్‌లో ‘హాయ్’ అని సందేశం పంపాలి. దీని తర్వాత మీకు మెసేజ్ ఆఫ్ సర్వీస్ ఆప్షన్ వస్తుంది. దాని నుంచి మీకు కావలసిన సేవను ఎంచుకోండి. మీరు ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరిస్తే.. మీకు కావల్సినవి దొరుకుతుంది.
ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి