భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ నిర్ణయం ఎంతో వివాదాస్పదమైంది. అలాంటి కథాంశంతో ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించి సంచలనాలకు కేరాఫ్‌గా మారారు బాలీవుడ్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఈ మూవీ దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడంతో మరోసారి వివాదాస్పదం అవుతోంది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కంగనా నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు థియేటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Kangana Ranaut Emergency Movie
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన.. ఎమర్జెన్సీ సినిమాను వివాదాలు వీడటం లేదు. సినిమా షూటింగ్ మొదలు విడుదలయ్యే వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొన్న కంగనా.. మూవీ రిలీజ్ అయ్యాక కూడా నిరసనలను ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌లో పలు సిక్కు సంఘాలు ఎమర్జెన్సీ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనకు దిగాయి.
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బయోపిక్ మూవీని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతూ వచ్చింది. సినిమా షూటింగ్ ముగిశాక సెన్సార్ సర్టిఫికెట్ కోసం కంగనా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అన్ని అడ్డంకులను ఎదుర్కొన్న కంగనా శుక్రవారం సినిమాను రిలీజ్ చేశారు.
ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కంగనా నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ పంజాజ్‌లో ఆందోళనలు మిన్నంటాయి. పలు సిక్కు సంఘాలు థియేటర్ల ముందు ఆందోళనకు దిగాయి. అమృత్‌సర్‌లోని థియేటర్ల ముందు ఎస్జీపీసీ సభ్యులు నిరసనకు దిగారు. ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు సిక్కు సంఘాల నేతలు. పరిస్థితి చేయి దాటితే పంజాబ్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో థియేటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది రాష్ట్రప్రభుత్వం.
కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికయ్యాక కూడా ఇలాంటి సినిమాలు చేయడం సరికాదన్నారు సిక్కు సంఘాల నేతలు. పంజాబ్ మినహా మిగతా చోట్ల ఎమర్జెన్సీ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ మూవీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమర్షియల్ హంగుల కోసం ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..