అందుకే ఎప్పుడు వచ్చినా ముంబయిలో దిగి, కొంత కాలం అక్కడే ఉండి, ప్రోగ్రాం ముగించుకుని అమెరికాకు తిరిగి వెళ్లిపోతుంది. అయితే ఈసారి ప్రియాంక చోప్రా హైదరాబాద్‌కు వచ్చింది. అది కూడా రహస్యంగా. రాజమౌళిని కలిసేందుకు ప్రియాంక భాగ్యనగరానికి వచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం రాజమౌళి, మహేష్ బాబు కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమా ఫోటో షూట్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండడంతో ముందుగా నటీనటులందరికీ శిక్షణ ఇస్తున్నాడు రాజమౌళి. అందుకోసమే ప్రియాంక ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబుల తదుపరి చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అందుకే.. ముందుగానే క్యాస్టింగ్‌కి ట్రైనింగ్ ఇస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అలాగే ఓ యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా, జోయా అక్తర్ దర్శకత్వం వహించే చిత్రంలో అలియా భట్, కరీనా కపూర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్‌కి మొదలైన సవాళ్లు.. డోజ్‌పై అమెరికన్ ఉద్యోగ సంఘం దావా
Naga Chaitanya: చేపల పులుసు వండి వడ్డించిన నాగ చైతన్య
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన