Airtel-TATA: కీలక ఒప్పందం.. టాటా DTHను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేయనుందా..?

2 hours ago 1

టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ. ఆ గ్రూప్‌కు చెందిన కంపెనీలు లాభాలను ఆర్జించడంలో ప్రసిద్ధి చెందాయి. కానీ టాటా గ్రూప్‌కు చెందిన డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవలను అందించే సంస్థ టాటా ప్లే ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. ఇప్పుడు సునీల్ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్‌టెల్ టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం డిజిటల్ టీవీ విభాగంలో ఎయిర్‌టెల్ తన పట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా టాటా ఎప్పటికీ కంటెంట్, వినోద కార్యకలాపాలకు దూరంగా ఉంటుంది.

టాటా ప్లే మార్కెట్ మారుతోంది

టాటా ప్లే దేశంలోనే అతిపెద్ద DTH కంపెనీ. అయితే మార్కెట్ డైనమిక్స్ వేగంగా మారుతున్నాయి. టైర్ 1, టైర్ 2 నగరాల్లోని వినియోగదారులు ఇప్పుడు డీటీహెచ్‌ సేవలకు బదులుగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఓవర్-ది-టాప్ (OTT) సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల వల్ల DTH మార్కెట్‌లో టాటా ప్లే షేర్, లాభాలు నిరంతరం తగ్గుతున్నాయి.

ఎయిర్‌టెల్ – టాటా మధ్య రెండవ ఒప్పందం:

ఈ డీల్ పూర్తయితే టాటా-ఎయిర్‌టెల్ మధ్య ఇది ​​రెండో పెద్ద డీల్ అవుతుంది. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం డీటీహెచ్ మార్కెట్‌లో ఎయిర్‌టెల్ రెండో అతిపెద్ద కంపెనీ. Tata Playని కొనుగోలు చేస్తే Airtel మార్కెట్ వాటా మరింత పెరుగుతుంది. జియో దూకుడు ఆఫర్‌లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్, టాటా ప్లేలో 70% వాటాను కలిగి ఉంది. 30% వాటాను వాల్ట్ డిస్నీ కలిగి ఉంది. డిస్నీ కూడా ఈ వ్యాపారం నుండి వైదొలగాలని యోచిస్తోంది.

టాటా మార్కెట్లో వాట:

టాటా ప్లే డిటిహెచ్ మార్కెట్‌లో 32.7% వాటాను కలిగి ఉంది. 20.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. భారతి టెలిమీడియా 27.8% మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలో ఉండగా, డిష్ టీవీ 20.8%, సన్ టీవీ డైరెక్ట్ 18.7% షేర్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. టాటా ప్లే బ్రాడ్‌బ్యాండ్ దాదాపు 480,000 మంది కస్టమర్‌లను కలిగి ఉంది. అలాగే ఫైబర్ బ్రాండ్ క్రింద సేవలను అందిస్తుంది.

డీల్ ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ ఒప్పందం కుదిరితే అది ఎయిర్‌టెల్ DTH, బ్రాడ్‌బ్యాండ్ విభాగాలలో దాని స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది జియో పోటీ ఆఫర్‌లతో బాగా పోటీ పడగలదు. చర్చలు ఇంకా చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article