ప్రముఖ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన చిరకాల స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. సోమవారం (జనవరి 20) చెన్నై వేదికగా జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు, షిమోనా రాజ్‌కుమార్ ల వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా డిమోంటి కాలనీ-1,2, విక్రమ్ కోబ్రా సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ జ్ఞానముత్తు. కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రసీమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు అజయ్. మురుగదాస్ సెవెంత్ సెన్స్ తో పాటు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీతో కోలీవుడ్ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే అందరినీ భయపెట్టాడు. ఈ చిత్రంలో అరుల్ నితి ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు రమేష్ తిలక్, సనంద్, అభిషేక్ జోసెఫ్ ముఖ్య పాత్రలు పోషించారు.
డిమాంటి కాలనీ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి ఇమైకా నొడిగల్ అనే సినిమాను తెరకెక్కించాడు జ్ఞానముత్తు. ఇందులో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో కనిపించాడు. అలాగే అధర్వ మురళి, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, రాశి ఖన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేకపోయినా అజయ్ టేకింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీని తర్వాత జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ తో కలిసి కోబ్రా ను తెరకెక్కించాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇందులో విక్రమ్ గెటప్పుల విషయంలో డైరెక్టర్ క్రియేట్ చేసిన విధానం ఆడియెన్స్ ను ఫిదా చేసింది.
ఇవి కూడా చదవండి
అజయ్ తెరకెక్కించిన డిమోంటీ కాలనీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి భాగంలో నటించిన అరుల్ నీతి, రమేష్ తిలక్, సనంద్, అభిషేక్ జోసెఫ్‌లతో పాటు నటి ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, బిగ్ బాస్ అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు అజయ్ జ్ఞానముత్తు కూడా తన చిరకాల స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు నటుడు విక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అయితే సతీమణి షిమోనా గురించి పెద్దగా వివరాలు తెలియరాలేదు.
నూతన దంపతులతో హీరో విక్రమ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.