టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఇందులో చైతూ సరసన న్యాచురల్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో తండేల్ ఈవెంట్స్ జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తన అల్లుడు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
తండేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మగధీర సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్. మగధీర సమయంలో రాజమౌళిని ఎందుకు సంప్రదించారు. ఆయన ఓ మంచి తెలుగు డైరెక్టర్. అడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి అనే లాజిక్ మీదే ఆ సినిమా చేయాలని అడిగారా.. ? అని యాంకర్ అడగ్గా.. అల్లు అరవింద్ స్పందిస్తూ.. “అంతేకాదు.. నా అల్లుడు రామ్ చరణ్ చేసిన ఫస్ట్ మూవీ కేవలం యావరేజ్ అయ్యింది. ఆ తర్వాతి సినిమాకు నేనే నిర్మాత. అందుకే చరణ్ కు పెద్ద హిట్ ఇవ్వాలనుకున్నాను. అందుకే మంచి దర్శకుడి దగ్గరకు వెళ్లాను. చాలా ఖర్చు పెట్టాను. అదే మగధీర తీయడానికి ప్రధాన కారణం. అనుకున్నది చేశాను. నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నా ప్రేమ” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చరణ్ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అల్లు అరవింద్ మాటలతో అటు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#AlluAravind connected approaching #SSRajamouli for #Magadheera :-
‘My premier motive was to springiness a large deed to my nephew #RamCharan & to amusement my emotion towards him pic.twitter.com/S4wtfnC1Wl
— Censor Talk (@TheCensorTalk) February 5, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన