చాలా మంది భారతీయుల ఇళ్లలో అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని వండుతారు. కానీ, అల్యూమినియం పాత్రల్లో ఆహారాన్ని వండటం ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా? ఇప్పటి వరకు మీకు తెలియకపోతే అల్యూమినియం పాత్రలలో వండటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని ఎందుకు వండకూడదు..?
మనం అల్యూమినియం పాత్రలను ఐరన్ స్క్రబ్‌తో శుభ్రం చేస్తే అందులో నుంచి లోహం బయటకు వస్తుంది. అప్పుడు మనం ఆ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడు, ఆహారంతో పాటు అల్యూమినియం కణాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల డయేరియా, అజీర్ణం, చర్మ సమస్యలు, ఎసిడిటీ మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇవి కూడా చదవండి
అల్యూమినియం పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు:
మెదడుపై ప్రభావం:
అల్యూమినియం పాత్రల్లో నిరంతరం వండడం, తినడం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. అంతిమంగా, ఇది మెదడు వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
నాడీ వ్యవస్థపై ప్రభావం:
అల్యూమినియం పాత్రల్లో నిరంతరం వండడం, తినడం వల్ల అందులో ఉండే కణాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది.
విపరీతమైన అలసట:
నిరంతరం అల్యూమినియం పాత్రలలో వండటం, తినడం వలన అకస్మాత్తుగా విపరీతమైన అలసట వస్తుంది.
మూత్రపిండాలపై ప్రభావం:
అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల పెద్దపేగుపై ప్రభావం పడటమే కాకుండా కిడ్నీలపైనా ప్రభావం చూపుతుంది.
క్యాన్సర్ ముప్పు..!
అల్యూమినియం పాత్రలలో వండటం, తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఏ పరిశోధన రుజువు చేయనప్పటికీ, అల్యూమినియం పాత్రలను అతిగా వాడటం వలన క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రజల్లో విస్తృతమైన నమ్మకం ఉంది.
పుల్లటి వస్తువుల నుండి ప్రమాదం!
టామాటో, నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండడం వల్ల అల్యూమినియంలో ఉండే అయాన్లు ఆహారంలో కరిగి శరీరంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)