తిరుపతిలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ దాడులు చేసి 8 మంది అంతరాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేసింది. వారి నుంచి 4 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన 6 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకుంది. కారు సహా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
Updated on: Feb 07, 2025 | 9:18 AM
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు దగ్గర ఆకస్మిక తనిఖీల్లో 185 దుంగలను పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో అటవీ శాఖ సిబ్బందితో కలసి ఆపరేషన్ నిర్వహించారు. సానిపాయ అటవీ ప్రాంతంలో కొమిటోని చెరువు దగ్గర ముందుగా కారు, మోటారు సైకిల్ గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. 8 మందిని పోలీసులు పట్టుకోగా మిగిలినవారు పరారయ్యారు. స్మగ్లర్లు తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. కర్నాటక హోస్కోట తాలుకా కటికనిల్లి నీలగిరి తోటలో దాచి ఉంచిన 185 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. వాటిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్మగ్లింగ్‌లో కింగ్ పిన్‌గా ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి