పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. సుదీర్ఘ ప్రయాణంలో తనతో పాటు పాలు పంచుకున్న నటించిన నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. అభిమానులు, ఆధారాభిమానం చూపిస్తున్న ప్రేక్షక లోకానికి రుణపడి ఉంటానన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా తోటి పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారాయన.
50 ఏళ్లుగా సినీ రంగంలో సేవలు బాలకృష్ణ సేవలకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు బాలకృష్ణ.
“కృతజ్ఞతాభివందనాలు, నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను. అప్పుడు… ఇప్పుడు… ఎల్లప్పుడూ… సదా మీ నందమూరి బాలకృష్ణ” అంటూ ట్వీట్ చేశారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..