గుజరాత్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ కోళ్ల గుర్తింపుపై ప్రత్యేక చర్చకు దారితీసింది. ఈ పిటిషన్ కోళ్లను చట్టబద్ధంగా జంతువుగా గుర్తించాలా లేక పక్షిగా గుర్తించాలా అనే విషయాలపై భిన్న వాదనలను న్యాయమూర్తి ముందుంచింది. సాధారణంగా రెక్కలు కలిగిన జీవులన్నింటినీ పక్షుల వర్గానికి చెందినవిగా చెప్తారు. కానీ పిటిషనర్ వాదనల ప్రకారం ఇది జంతు వర్గానికి చెందినది ఎందుకు కాకూడదనే ప్రశ్నలను లేవనెత్తింది.
2023లో జంతు సంక్షేమ ఫౌండేషన్, అహింసా మహా సంఘ్ వారు దుకాణంలో కోళ్లను వధించడాన్ని నిషేధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆ సమయంలో కోడిని జంతువుగా పరిగణించవచ్చా అని కోర్డు ప్రశ్నించింది. దీంతో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్2(ఎ)ని ఎత్తి చూపారు. అందులోని సారాంశం ప్రకారం మనిషి కాకుండా ఏదైనా ప్రాణమున్న జీవాన్ని జంతువుగా గుర్తించవచ్చ.
గతంలోనే కోర్టు తీర్పు..
మాంసం దుకాణాల్లో జంతు వధను నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 గురించి కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. ఆ సమయంలో కోడి జంతువా లేక పక్షా అనే దానిపై ప్రభుత్వం నుంచి వివర కోరుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. వి అంజరియా, జస్టిస్ నిరల్ మెహతాలతో కూడిన డివిజన్ బెంచ్ అనేక రకాల విచారణలకు అధ్యక్షత వహించింది. అనంతరం కోడిని పక్షిగా కాకుండా జంతువుగా పరిగణించాలని స్పష్టం చేశారు. చేపలను మాత్రం ఈ వర్గం నుంచి మినహాయించారు.
ఇంతకీ సైన్స్ ఏం చెప్తోంది..
శాస్త్రీయంగా చూసుకుంటూ కోడిని పక్షిగా, జంతువుగా కూడా గుర్తించవచ్చు. మొక్కలు, శీలింధ్రాలు, బ్యాక్టీరియా వంటివి తప్ప అన్ని సూక్ష్మజీవులను తినగలగడం వల్ల వీటిని జంతువులుగానే పరిగణించాలని చెప్తోంది. మరోవైపు వీటిని సైన్స్ ఏవ్స్ కింద వర్గీకరిస్తుంది. అంటే గుడ్లు పెట్టే రెక్కలు కలిగిన పక్షులను కలిగి ఉన్న వర్గం ఇది. ఇది కోళ్లను పక్షులుగా చెప్పే వాదన.
ఎవరికి నష్టం..?
కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని గతంలోనే గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. వీటిని చికెన్ షాపుల్లో వధించడం కన్నా కబేళాల్లోనే వధించాలని యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్, అహింసా ఫెడరేషన్ లు పిటిషన్ దాలు చేశాయి. లేని పక్షంలో పౌల్ట్రీ షాపులను, మాంసం దుకాణాలను మూసివేయాలని కోర్టు ఆదేశించింది. కానీ కబేళాల్లో జంతువులను మాత్రమే వధించాలని అవి కోళ్లకోసం కాదని చికెన్ షాపు యజమానులు వాదిస్తున్నారు. కోర్టు తీర్పు తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.