ఓ పద్దతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్ అంటూ ముందుకెళ్తున్నారు చిరంజీవి. ఈయన ప్లానింగ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుందేమో..? కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు కానీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా కుమ్మేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మెగాస్టార్. ఏడాదిన్నరలో 3 సినిమాలతో రాబోతున్నారీయన. ఇంతకీ చిరు ఏం చేస్తున్నారు..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 10, 2025 | 9:16 PM
విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు వశిష్ట. మరోవైపు విశ్వంభర పూర్తి కాగానే.. రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి రేసులో ముందున్నారు.
1 / 5
మే నుంచే ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి రానుందని నిర్మాత సాహు గరపాటి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసారు. చిరంజీవితో ఎప్పట్నుంచో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు అనిల్.
2 / 5
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం కథ ముందుగా చిరుకే చెప్పారు అనిల్. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడన్నీ కుదిరాయి.. బాస్‌తో పక్కా మాస్ సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి.
3 / 5
విశ్వంభర విడుదలైన ఆర్నెళ్ళలోపే అనిల్, చిరు సినిమా కూడా రానుంది. అంటే ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా అన్నమాట. 2025 సెకండాఫ్‌లో విశ్వంభర.. 2026 సంక్రాంతికి అనిల్ సినిమాలతో రానున్నారు చిరంజీవి.
4 / 5
ఇక శ్రీకాంత్ ఓదెల సినిమా సైతం వచ్చే ఏడాదే రానుంది. నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్న ఓదెల.. దీని తర్వాత మెగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. అంటే ఏడాదిన్నర గ్యాప్‌లోనే 3 సినిమాలతో రాబోతున్నారు మెగాస్టార్. పైగా మూడు కుర్ర దర్శకులతోనే..!
5 / 5