టాలీవుడ్ సినీపరిశ్రమలో రఘుబాబు తెలియనివారుండరు. ఇప్పటివరకు వందలాది చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. విలన్, తండ్రిగా, అన్నగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అయితే తన జీవితంలో దాదాపు 400 సినిమాల్లో నటించడానికి కారణం ఓ వ్యక్తి అంటూ ఎమోషనల్ అయ్యారు.
Raghu Babu
Updated on: Feb 12, 2025 | 4:18 PM
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని కమెడియన్ రఘుబాబు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా అరంగేట్రం చేశారు రఘుబాబు. ఆయన తండ్రి గిరిబాబు సైతం నటుడు కావడం విశేషం. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తండ్రిలాగే తనయుడు సైతం సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు రఘుబాబు తనయుడు గౌతమ్ రాజా సైతం తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రఘుబాబు, ఆయన తనయుడు గౌతమ్ రాజా కలిసి నటిస్తున్న సినిమా బ్రహ్మ ఆనందం. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘుబాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి గురించి భావోద్వేగ కామెంట్స్ చేశారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. ?
రఘుబాబు ఇప్పటివరకు దాదాపు 400 చిత్రాల్లో నటించారు. అందులో బన్నీ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘బన్నీ సినిమా సక్సెస్ మీట్ లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరు సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు. కానీ నా పేరు ఎవరు తీయలేదు. స్టార్ డైరెక్టర్ వినాయక్ సైతం ఏంటయ్యా.. నువ్వు ఈ సినిమాలో అంత బాగా నటిస్తే కనీసం నీ పేరు కూడా ఎవరూ తీయడం లేదని అడిగాడు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై నా పేరు చెబుతూ పొగిడారు. బన్నీ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటే అది కేవలం రఘుబాబు కోసమే అని ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మార్చిపోలేను. ఆయన పొగడబట్టే నేను ఇప్పటివరకు దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించాను. ఆయన ప్రశంసే నన్ను ఇక్కడివరకు తీసుకువచ్చింది. ఎప్పటికీ చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను’ అంటూ ఎమోషనల్ అయ్యారు రఘుబాబు.
ప్రస్తుతం తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన నటులలో రఘుబాబు ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన