పైసామే పరమాత్మ హై. అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలయితే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతుంది. బంధులు, స్నేహితులు, తెలిసిన వారిదగ్గర పరపతి కూడా పెద్దదవుతుంది. అందుకే ఈ అమెరికా డ్రీమింగ్, డాలర్ చేజింగ్. అయితే ఈ చేజింగ్‌లో చాలా జరుగుతున్నాయి. అమెరికాకు డాంకీ రూట్‌లో వచ్చి యువకులు దొరికిపోతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు.
Donald Trump
పైసామే పరమాత్మ హై. అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలయితే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతుంది. బంధులు, స్నేహితులు, తెలిసిన వారిదగ్గర పరపతి కూడా పెద్దదవుతుంది. అందుకే ఈ అమెరికా డ్రీమింగ్, డాలర్ చేజింగ్. అయితే ఈ చేజింగ్‌లో చాలా జరుగుతున్నాయి. అమెరికాకు డాంకీ రూట్‌లో వచ్చి యువకులు దొరికిపోతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. దీంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు స్టూడెంట్స్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తూ దొరికిపోవడం జరుగుతోంది. ఇలాంటి వారిని కూడా జైళ్లకు పంపుతున్నారు. ఆ జైళ్లలో క్రిమినల్స్‌తో పాటు ఉంటూ చిత్రవధ అనుభవిస్తున్నారు.
అయితే అమెరికా జైళ్లలో ఉన్న వారిని తరలించడానికే ఎందుకు ట్రంప్ మొగ్గుచూపుతున్నారు? ఒక్కో డిపోర్టీ మీద నాలుగున్నర వేల డాలర్లు అంటే.. నాలుగు లక్షల రూపాయల ఖర్చు ఎందుకు చేస్తున్నారు? మరిన్ని వివరాలు వెంకట్ డాలస్ నుంచి అందిస్తారు. ఇక్కడి నుంచి ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. వారిలో స్టూడెంట్సే ఎక్కువ. అమెరికాలోని ఏదో ఓ వర్సిటీలో సీటు పట్టి.. అక్కడకు వెళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ.. తమకోసం పాకెట్ మనీ సంపాదించుకుందామనుకునే వారే ఎక్కువ. అలాంటి వారు వేలల్లో ఉన్నారు. యూఎస్ వెళ్లి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూనే లక్షలు సంపాదించే వారున్నారు. రోజుకు 8 నుంచి పది గంటల పాటు వివిధ స్టోర్లు, రెస్టారెంట్స్‌లో పనిచేస్తున్న స్టూడెంట్స్.. ఇప్పుడు జాబులు వదిలేశారు. వర్సిటీలోనే తలదాచుకుంటున్నారు. మరి ఎక్స్‌పెన్సెస్ ఎలా? ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులను డబ్బులు అడుగుతున్నారు. కొన్ని నెలల పాటైనా డబ్బు పంపాలంటున్నారు. దీంతో తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు.
ఇక్కడే తాము పేదరికరంలో ఉన్నామని.. ఎలా డబ్బు పంపాలో తెలియడం లేదంటున్నారు. అమెరికాలో పాలకులు చట్టాలని సడలించి.. తమ పిల్లలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునేలా చూడాలంటున్నారు. డిపోర్టేషన్ ప్రాసెస్ చాలా పెద్దది. ఒక వ్యక్తి అక్రమంగా వచ్చాడు.. ఇక అమెరికాలో జీవించడానికి అర్హుడు కాదని ముద్రవేసి.. అతడిని క్రిమినల్‌లా సంకెళ్లతో పంపడానికి ఎన్నో లేయర్లు దాటాలి. ఇలా తొలి విడతలో 18వేలమంది భారతీయులను పంపుతోంది అమెరికా. ఇందులో తొలి బ్యాచ్ ఇప్పుడు వచ్చింది. రెండో బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? వారిలో తెలుగు వారు కూడా ఉంటారా? మరిన్ని వివరాలు శివ అట్లాంట నుంచి అందిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి