అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 7)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమానుఆసక్తికరంగా తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఇక సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా చుసిన ప్రేక్షకులకు సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు. అలాగే సినిమాకు దేవీ శ్రీ ఇచ్చిన సంగీతం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజగా తండేల్ సినిమా పై శోభిత ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.
తండేల్ సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన శోభిత. తండేల్ మూవీపై చైతూ చాలా నెలల నుంచి దృష్టి పెట్టారు., సినిమా షూట్ చేస్తున్నన్ని రోజులు పాజిటివ్ గా ఉన్నారని చెప్పింది శోభిత. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ పోస్ట్ చేసింది శోభిత. ఈ పోస్ట్ కు చైతన్య ఆసక్తికర రిప్లే ఇచ్చారు. శోభిత పోస్ట్ షేర్ చేస్తూ థాంక్యూ మై బుజ్జి తల్లి అంటూ హార్ట్ ఎమోజీని షేర్ చేశారు నాగ చైతన్య. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.