సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. మహేష్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మహేష్ కు అభిమానులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలవెలపల్లిలో పెళ్ళి శుభలేఖ పై హీరో మహేష్ బాబు ఫోటో ప్రింట్ చేశారు.. తన పెళ్ళి శుభలేకపై అభిమాన నటుడు మహేష్ బాబు ఫోటో వేయించుకున్నాడు పెళ్ళికొడుకు. పెళ్ళి కొడుకు యిళ్ళ సత్య మహేశ్ బాబుకు వీర అభిమాని.. దాంతో అతని పెళ్ళి శుభలేఖ పై మహేష్ బాబు ఫోటో వేసి శుభలేఖలు స్నేహితులకు, బంధువులకు పంచాడు. ఈనెల 8వ తేదీన జరగబోయే తన పెళ్లికి రావాలంటూ స్నేహితులు బంధువులు అందరికీ శుభలేఖలు పంచాడు. తనకు ముగ్గురు దేవుళ్ళని మొదటి దేవుడు యేసు క్రీస్తు, రెండో దేవుళ్ళు తల్లిదండ్రులు, మూడో దేవుడు మహేష్ బాబు అంటున్నడు పెళ్లి కొడుకు సత్య.
ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణం పోసిన మహేష్ బాబుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎంతోమంది చిన్నారులకు ప్రాణం పోస్తున్న మహేష్ బాబు తనకు దేవుడితో సమానమని అందుకే తన పెళ్లి శుభలేఖ మహేష్ బాబు ఫోటో వేసాను అంటున్నడు పెళ్లి కొడుకు.
సాధారణంగా పెళ్లి శుభలేఖల పై దేవుళ్ళ ఫోటో వేస్తారు అయితే ఇతను తన అభిమానం చాటుకునేందుకు శుభలేఖపై హీరో మహేష్ బాబు ఫోటో వేసి శుభలేఖలు పంచడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. మనుషుల్లో ఉన్న దేవుడు మహేష్ బాబు అని ఆయన ఆశీస్సులు ఒక్కటవ్వబోతున్న తమను మహేష్ బాబు దీవించాలని కోరుతున్నాడు పెళ్ళికొడుకు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి