స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది. 2012లో విడుదలైన ‘సెకండ్ షో’ చిత్రంతో దుల్కర్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఉస్తాద్ హోటల్’ సినిమా అభిమానుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.
మలయాళం, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు దుల్కర్ సల్మాన్. సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం వంటి పెద్ద మేనేజ్‌మెంట్ లేకుండా సినిమాల్లో నటించినా.. తన సహజమైన నటనతో దుల్కర్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరోసారి టాలీవుడ్ దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగులో డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడని, ఈ చిత్రాన్ని శ్రీ లష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోతున్నారని టాక్ నడుస్తుంది.
అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుందనే టాక్ నడుస్తుంది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించనుందని ప్రచారం నడుస్తుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన