ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సింగింగ్, డ్యాన్సింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. అవును ఆయన టాలెంట్ చూసి రియల్ సింగర్ సైతం ఆశ్చర్యపోయారు. అరకు చలి ఉత్సవాల సందర్భంగా ఈ సీన్ చోటుచేసుకుంది. ఇంతకీ ఆ ఆశ్చర్యపోయిన సింగర్ ఎవరు అనుకుంటున్నారా.. ఎం. ఎం శ్రీలేఖ. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
IAS Singing
అరకు చలి ఉత్సవాలు.. సాయంత్రం వేళ.. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ స్టేజ్ పై ఉన్నారు.. సాఫ్ట్ మ్యూజిక్ ప్రారంభమైంది.. అందరూ కేరింతలు.. ఎందుకంటే అంతటి పాపులర్ సాంగ్ అది.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీలోని చంద్రబోస్ రాసిన పాట.. సిద్ శ్రీరామ్, సునీత మూవీకోసం ఆలపించిన ఆ గీతం సంగీత ప్రియులను హత్తుకున్న సంగతి తెలిసిందే. ఎస్.. మీరు ఊహించింది కరెక్ట్.. ‘నీలి నీలి ఆకాశం..’ సాంగ్..! ఆ పాట చలి ఉత్సవాలలో మరో ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే.. ఎం ఎం శ్రీలేఖకు స్వరాన్ని కలిపారు ఐఏఎస్ అధికారి. ‘ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న.. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా’ అంటూ అంటూ పాడారు. పాట చరణం.. పల్లవి.. అద్భుతంగా పాడి ఔరా అనిపించారు. అక్కడే ఉన్న కొంతమంది అతను అధికారి అని గుర్తుపట్టినా.. మరికొంతమంది పాపులర్ సింగర్ అయి ఉంటారని భావించారు. అసలు విషయం తెలుసుకున్నాక ఔరా అనక తప్పలేదు. చప్పట్లతో అభిమానించారు..
ఎస్.. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి అభిషేక్. ఆయనే స్టేజిపై ఎంఎం శ్రీలేఖతో కలిసి స్వరాన్ని కలిపారు. నీలి నీలి ఆకాశం.. పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అభిషేక్ పాడుతున్నప్పుడు.. అతని ఉత్సాహానికి, టాలెంట్ కు ఎం ఎం శ్రీలేఖ కూడా అభినందిస్తూ ప్రోత్సహించకుండా ఉండలేకపోయారు. ఇంకేముంది.. అద్భుతమైన రాగం పల్లవి చరణాన్ని జోడించి పాటను పాడి.. అందరిని ఫిదా చేశారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్. చలి ఉత్సవాల్లో.. పీవో అభిషేక్ కృషి మడత పెట్టి సాంగ్కు ఇరగదీసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అతని ఉత్సాహాన్ని చూసిన జనం.. వార్నీ.. మల్టీ టాలెంటెడ్ గురు అంటూ ఆ అధికారిని ప్రశంసించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి