విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు.
డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆడియన్స్ లేకపోతే ఈ విజయాన్ని మేము ఊహించలేము. ఎర్లీ మార్నింగ్ షోస్ కి ఫ్యామిలీస్ తో కలిసి సినిమా చూశారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే. నా కెరియర్ లో ఇది ఒక మిరాకిల్. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ గారికి దక్కుతుంది. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. సినిమా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ నిర్మాత హ్యాపీగా ఉండాలనే టార్గెట్ పెట్టుకుని సినిమాను తీస్తుంటాను. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు సినిమాలు రాజు గారితో చేశాను. ఎస్విసి బ్యానర్ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బ్యానర్. ఆ బ్యానర్ కొన్ని జనరేషన్స్ ఉండాలి, ఉంటుంది.
డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన నెంబర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్ కి మెమరబుల్ అయింది. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి. ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిలిం కి చూడలేనేమో అనుకున్న 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు చాలా బాధ్యత పెరిగింది. ఈసారి డిస్ట్రిబ్యూటర్స్ తో వేడుక జరిగింది నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ తో కూడా ఒక ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్డ్స్ ని అందరికీ ఇవ్వాలని భావిస్తున్నాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన