పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మిర్చి ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 ఫిబ్రవరి 8న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ జోడిగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ సినిమాలో నదియా, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు లీడర్ మూవీలో కనిపించింది. అలాగే తెలుగులో పలు సినిమాల్లో నటించిన రిచా.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం తన భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా గడుపుతుంది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిచా. ఇందులో రానా జోడిగా కనిపించి మెప్పించింది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత రవితేజ జోడిగా మిరపకాయ్ మూవీలో కనిపించింది. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ సరసన మిర్చి సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత రిచాకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ కేవలం నాగవల్లి, బాయ్, సారొచ్చారు వంటి చిత్రాల్లో నటించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నహేతుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019లో వీరి వివాహం జరగ్గా.. 2021లో వీరికి లూకా షాన్ లాంగెల్లా అనే బాబు జన్మించాడు. అటు సోషల్ మీడియాలోనూ రిచా అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. తాజాగా రిచా ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన