రాజస్థాన్‌లో ఆదివారం(ఫిబ్రవరి 2) మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బికనీర్‌కు 72 కిలోమీటర్ల దూరంలోని జస్రాసర్‌లోని మహారామ్‌సర్ ప్రాంతంలో కేంద్రకృతమైంది. వాతావరణ శాఖ ప్రకారం, బికనీర్ తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12.58 గంటలకు భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని అధికారులు తెలిపారు. హఠాత్తు పరిణామంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) వెబ్‌సైట్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం బికనీర్ సమీపంలో భూమికి పది కిలోమీటర్ల దిగువన సంభవించింది. అదే సమయంలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఇది అజ్మీర్‌కు ఉత్తర-వాయువ్యంగా 169 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. అయితే కొన్ని చోట్ల స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అదే సమయంలో, దీనికి ఒక రోజు ముందు, శనివారం(ఫిబ్రవరి 1) పశ్చిమ బెంగాల్‌లో కూడా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారుల ప్రకారం, కూచ్ బెహార్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.8గా నమోదైంది. అదే సమయంలో, భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ఇది గాంగ్‌టక్‌కు ఆగ్నేయంగా 154 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. ఫిబ్రవరి 1 సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించింది.
అంతకుముందు జనవరి 31న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉదయం 9.28 గంటలకు భూకంపం వచ్చింది. NSC ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.7గా నమోదైంది. అదే సమయంలో, దాని కేంద్రం ఉత్తరకాశీలో భూమికి 5 కిలోమీటర్ల దిగువన నమోదు అయ్యింది. ఇది ఉత్తరకాశీకి ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..