భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని గెల్చుకున్న భారత్ 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాబట్టి ఈ మ్యాచ్ లాంఛనప్రాయం కాబట్టి భారత జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయితే ఈ మ్యాచ్ కొందరి ఆటగాళ్లకు కీలకం కానుంది. ముఖ్యంగా పేలవమైన ఫామ్ తో సతమతమవుతోన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఐదో మ్యాచ్‌లో నైనా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ముగించాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ కనీసం ఈ మ్యాచ్ లో నైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
తుది జట్టులో మహ్మద్ షమీకి స్థానం..
Tonight’s Playing XI successful Mumbai 👌
Live ▶️ https://t.co/B13UlBNLvn#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/C2uFvHYA3k
— BCCI (@BCCI) February 2, 2025
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..