ఇటీవలి కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు చాలా పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ స్త్రీలలో వచ్చేది. కొంత వరకు ఇలాంటి కేసులు పురుషులలో కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి కేసులు యువతులలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది ఒక సాధారణమైందే కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్య అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.. ఇది ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది అనేక ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. యువతులలో ఈ సమస్య ఎందుకు పెరుగుతోంది..? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకోండి.
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఎందుకు పెరుగుతోంది?
ఈ రోజుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా 5 ఏళ్లలోపు బాలికల్లోనూ కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే బాలికల్లో ఇలాంటి కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
యూరిన్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు
1. నీటి కొరత- పాఠశాలకు వెళ్లే బాలికలు సాధారణంగా పాఠశాలలో తక్కువ నీరు తాగుతారు. దీని కారణంగా ఈ వ్యాధి పెరుగుతోంది.
2. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకోవడం – యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన స్కూల్‌కు వెళ్లే బాలికలు ఎక్కువ సమయం పాటు మూత్రానికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకుని కూర్చోవడం అంటున్నారు వైద్యులు.. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకోవటం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు.
3. మురికి మరుగుదొడ్లను ఉపయోగించడం- చాలా సార్లు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండవు. ఆ మురికి సీట్లను ఉపయోగించడం కూడా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు కారణం అంటున్నారు వైద్యులు.
యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు:
* మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట.
* తరచుగా మూత్రవిసర్జన.
* మూత్రంలో రక్తం పడటం.
* జ్వరం, అలసటగా ఉండటం.
* పొత్తి కడుపులో నొప్పి అనుభూతి.
ఏం చేయాలి?
ఇంట్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పించాలని వైద్యురాలు చెబుతున్నారు. రోజుకు సరైన మొత్తంలో నీరు తాగేలా చూడాలని, వారికి సలహా ఇవ్వాలని చెబుతున్నారు. టాయిలెట్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్పించాలని చెబుతున్నారు. అలాగే సున్నిత ప్రాంతాల పరిశుభ్రత గురించి కూడా వివరంగా చెప్పాలంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.