ఫిబ్రవరి 7న జరిగే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం కంటే ముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లతో సహా అనేక బ్యాంకులు జనవరిలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను మార్చాయి. జనవరిలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏ స్థాయిలో వడ్డీ రేట్లు పెరిగాయో? తెలుసుకుందాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఏడు శాతం వడ్డీ రేటుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 303 రోజుల కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను లాంచ్ చేసింది. సాధారణ పౌరులకు 6.7 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 400 రోజుల పదవీకాలం అత్యధిక వడ్డీ రేటు 7.25 శాతం అందిస్తుంది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అప్‌డేట్ చేసినట్లు పేర్కొంది. బ్యాంక్ అందించే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సాధారణ పౌరులకు 3.50 శాతం నుంచి 8.80 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుండి 9.30 శాతం వరకు ఉంటాయి. ఈ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు జనవరి 22 నుండి అమలులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి
కర్ణాటక బ్యాంక్
కర్ణాటక బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలానికి 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 375 రోజులకు, అత్యధికంగా 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు జనవరి 2 నుంచి సవరించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రూ. 3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ మార్చింది. ఫలితంగా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు ఇప్పుడు 3.5 శాతం నుంచి 7.30 శాతం మధ్య ఉన్నాయి. 456 రోజులకు సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 7.30 శాతం అందుబాటులో ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్
రూ. 3 కోట్లు కంటే తక్కువ ఎఫ్‌డీల కోసం యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 27 నుంచి అమలులోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి