దిన ఫలాలు (జనవరి 18, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మిథున రాశి వారికి అనేక మార్గాల ద్వారా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సాధారణంగా మీ మాట చెలామణీ అవుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. రావలసిన డబ్బు వసూలవుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో కొద్దిగా వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగం మారడా నికి ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనేక మార్గాల ద్వారా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికంగా బాగా లాభాలను కలిగిస్తాయి. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకు దూసుకువెడతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో చిన్నపాటి పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిర త్వం లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందు తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. పిల్లల చదువు లకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో హోదా పెరిగే అవకాశం ఉంది. జీతభత్యాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపో వచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సందడిగా, సరదాగా సాగిపోతుంది. పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమ వుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పిల్లల చదువుల విషయంలో కొద్దిగా శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబసమేతంగా కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగాల్లో అధికారులు బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. కొద్దిగా కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ సమర్థ తకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మరింత మెరుగైన ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవ హారాలు చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆరోగ్యా నికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ రోజంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల నుంచి చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించి ఆఫర్ అందే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. సాటి ఉద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబంతో ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులక కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబంపై ఖర్చు పెరుగుతుంది. పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు అందుతాయి.