కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బాబు పుట్టాడన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుందామె. ఈ సందర్భంగా తన భర్త కార్తీక్ చెయ్యి, తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చెయ్యిని కూడా తీసుకొని తీసిన ఫొటోని నెట్టింట షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఇంద్రజ- కార్తీక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళంలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోబో శంకర్ కుమార్తె నే ఇంద్రజ శంకర్. తండ్రి అడుగు జాడల్లోనే ఇంద్రజ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కంచిన బిగిల్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె పోషించిన పాండియమ్మ పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో ఈ సినిమా తర్వాత అందరూ ఇంద్రజను పాండియమ్మా అని పిలవడం ప్రారంభించారు. విజిల్ తర్వాత విశ్వక్ సేన్ పాగల్, కార్తీ విరుమాన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఇంద్రజ. అలాగే పలు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది.
ఇంద్రజ వివాహం గతేడాది జరిగింది. తన ఫ్యామిలీకి సన్నిహితుడైన డైరెక్టర్ కార్తీక్ తో కలిసి ఆమె ఏడుడుగులు వేసింది. గతేడాది ఆగస్టులో తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఇద్రజ. ఓ షో చేస్తున్నప్పుడే తాను ప్రగ్నెంట్ అని ప్రకటించి షో నుంచి తప్పుకుంది. గర్భం ధరించాక కూడా ఇంద్రజ పలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. . ఈ లేడీ కమెడియన్ శ్రీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇంద్రజ పండంటి బాబుకి జన్మనించ్చింది. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇవి కూడా చదవండి
భర్త కార్తీక్ తో నటి ఇంద్రజా శంకర్..
ఇంద్రజ, కార్తీక్ ల పెళ్లి వేడుకలో రోబో శంకర్..
సూపర్ స్టార్ రజనీకాంత్ తో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.