మెగా వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడానికి 10 ఫ్రాంఛైజీల దగ్గర రూ.641.5 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా 110.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ వేలంలో వేటకు సిద్ధమైంది. 83 కోట్లతో బెంగళూరు, 73 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వేలంలో పాల్గొనబోతున్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ దగ్గర 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. కోల్‌కతా దగ్గర 51 కోట్లు ఉండగా.. ముంబయి, సన్‌రైజర్స్ చేతిలో 45 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ చెరో 69 కోట్లతో సిద్ధమయ్యాయి.
Rishabh Pant
ఐపీఎల్ మెగా వేలం షురూ అయింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేందుకు ఐపీఎల్ -2025 మెగా వేలం సిద్దమైంది. ఆదివారం, సోమవారం జెద్దా వేదికగా మెగా వేలం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఆటగాళ్లకు కోట్లు వెచ్చించి కొనుక్కునేందుకు 10 ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. 577 మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. వేలంలో 367 మంది భారత్ ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. కనీస ధర 2 కోట్లు. ఈ జాబితాలో 81 మంది ప్లేయర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకు జెద్దా వేదికగా జరిగే మెగా వేలం హాట్‌టాపిక్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకు వచ్చిన టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికే అవకాశం ఉంది. దీంతో పంత్ కోసం గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడడానికి పంత్ ఇష్టంగా లేడు. దీంతో ఆ ఫ్రాంఛైజీ రైట్ టూ మ్యాచ్- RTM కార్డును ప్రయోగించే అవకాశం లేదు. పంత్‌కు భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. 25 కోట్ల వరకూ పలికే అవకాశం కనిస్తోంది. అదే జరిగితే పాతిక కోట్లు సాధించిన భారత తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం 45 కోట్లు మాత్రమే ఉన్న ముంబయి ఇండియన్స్, 55 కోట్లున్న చెన్నై సూపర్ కింగ్స్- పంత్ కోసం పెద్దగా పోటీ పడకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, బెంగళూరు మధ్యే ప్రధానంగా పోటీ ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. మంచి కెప్టెన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ మొత్తంతో పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లే అవకాశముంది.
577 players to spell nether hammerINR 600+ Crore to beryllium spentWho is going to beryllium the astir costly cricketer successful the past of IPL.
My instrumentality is Rishabh Pant ! Yours?#IPLAuction pic.twitter.com/UKi8qZqBTd
— Priya Vatsh (@Priyankavatsh) November 24, 2024
ఇక ఫ్రాంఛైజీలను ఆకర్షించే ఆటగాళ్ల జాబితాలో అర్ష్‌దీప్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లూ ఆసక్తిరేపుతున్నారు. శ్రేయస్‌ను ఢిల్లీ, రాహుల్‌ను కోల్‌కతా కెప్టెన్లుగా తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ సీజన్‌లో శ్రేయస్ కోల్‌కత్తా తరుపున, రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున కెప్టెన్స్‌గా చేశారు. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌కు మంచి ధర పలకొచ్చు. లాస్ట్ ఇయర్‌లా ఇషాన్ కోసం రూ.15.25 కోట్లు ఇచ్చి తీసుకోవడానికి ముంబై రెడీగా లేనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో 96 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశముంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..