గత కొన్ని రోజులుగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర త్రివేణి సంగమాన్ని దర్శించుకున్నారు. కుంభమేళాకు భారీ సంఖ్యలో జనాలు తరలివస్తున్నారు. మరోవైపు సినీతారలు సైతం ప్రయాగ్ రాజ్‌కు క్యూ కట్టారు. ఇప్పటికే సాధువులు, అఘోరాలు, ఋషులు, పలువురు సెలబ్రెటీలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభమేళాలో ఓ హీరోయిన్ సన్యాసిగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటి మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. తనే మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి ఇషికా తనేజా. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సంచలనమైన ఈ హీరోయిన్.. ఇప్పుడు కుంభమేళాలో సన్యాసం తీసుకుని అభిమానులకు షాకిచ్చింది. ఇకపై తాను సినిమాల్లో నటించనని తెలిపింది. 2017లో మిస్ ఇండియా అందాల పోటీలో పాపులారిటీ , మిస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ టైటిల్స్ గెలుచుకుంది ఇషిక. అలాగే మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ద్వారక శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి నుంచి గురు దీక్ష తీసుకుంది. అలాగే తన పేరును శ్రీలక్ష్మిగా మార్చుకుంది. ప్రస్తుతం ఇషికాకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
” నేను సాధ్విని కాదు, నేను గర్వించదగ్గ సనాతనిని. నేను సేవా స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాను. మహా కుంభమేళాలో దైవిక శక్తులు ఉంటాయి. నా జీవితంలో అతి పెద్ద విజయం… ఏమిటంటే, నేను శంకరాచార్య గారి నుండి గురు దీక్షను పొందాను. గురువు ఉండటం నాకు జీవితంలో ఒక దిశానిర్దేశం చేసింది ” అంటూ చెప్పుకొచ్చింది ఇషికా.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన