కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న శక్తి పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టతనిచ్చారు.
అయితే, సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారని, దీనిపై చర్చిస్తాం డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. 2023 జూన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని మొదలుపెట్టారు. ఈ శక్తి స్కీమ్ వల్ల ప్రభుత్వంపై ఏటా 7 వేల 600 కోట్ల వరకూ భారం పడుతోంది. దీని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి దీనిపై స్పష్టతనిచ్చారు.
ఇవి కూడా చదవండి