Valentine's Day Astrology: ఈ నెల 14వ తేదీన జరగబోతున్న వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) పురస్కరించుకుని ఏయే రాశుల వారు ఈ నెల ప్రేమల్లో పడేదీ, ఎవరు విజయాలు సాధించేదీ, ఎవరి ప్రేమలు పెళ్లిళ్లకు దారితీసేదీ అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ఈ నెలంతా మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, పైగా శుభ కార్యాలకు కారకుడైన గురువుతో పరివర్తన చెందడం వల్ల కొన్ని రాశుల వారు ప్రేమ ప్రయత్నాలు, వ్యవహారాల్లో ఘన విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది.
Love Astrology 2025
ఈ నెల 14వ తేదీన జరగబోతున్న వాలెంటైన్స్ డే లేదా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయే రాశుల వారు ఈ నెల ప్రేమల్లో పడేదీ, ఎవరు విజయాలు సాధించేదీ, ఎవరి ప్రేమలు పెళ్లిళ్లకు దారితీసేదీ ఇక్కడ పరిశీలిద్దాం. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ఈ నెలంతా మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, పైగా శుభ కార్యాలకు కారకుడైన గురువుతో పరివర్తన చెందడం వల్ల కొన్ని రాశుల వారు ప్రేమ ప్రయత్నాలు, వ్యవహారాల్లో ఘన విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశుల్లో వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశులున్నాయి. ప్రేమికుల దినోత్సవం రోజున శుక్రుడు ఉచ్ఛలో ఉండడం ఈ రాశులవారికి మహా అదృష్టంగా భావించాలి.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల, పైగా గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారు ప్రేమలో పడడం తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రేమలు సంప్రదాయబద్ధమైన పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా సాటి ఉద్యోగితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఈ శుక్రుడు గురువుతో పరివర్తన చెందినందువల్ల ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీతో, గౌరవ మర్యాదలతో వ్యవహరించడం జరుగుతుంది. వీరి ప్రేమ నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల సంపన్నకుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, విదే శాల్లో ఉన్న వ్యక్తితో గానీ ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమ వ్యవహారాలు సమీప భవిష్యత్తులో పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా జీవిత భాగ స్వామి సున్నిత మనస్కులు అయి ఉంటారు. ప్రేమ భాగస్వామితో విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం కూడా ఉంది. అతి తక్కువ కాలంలో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరి వర్తన జరిగినందువల్ల ఈ రాశివారు ప్రేమలో పడడం జరుగుతుంది. కులాంతర ప్రేమ అయి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారి ప్రేమ వ్యవహారం తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది. పెద్దల అనుమతి లభిస్తుంది. ప్రేమించిన వ్యక్తి సంపన్న వ్యక్తిగానీ, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తిగానీ అయి ఉండవచ్చు. ప్రేమ భాగస్వామితో నిజాయతీతో వ్యవహరించడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, పంచమ, సప్తమ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ప్రేమ ప్రయత్నాల్లో ఘన విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. సాధారణంగా స్నేహి తులు, పరిచయస్థులు, సహోద్యోగులతో ప్రేమలో పడడం జరుగుతుంది. కుటుంబ పెద్దల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వీరు తప్పకుండా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, పైగా చతుర్థ స్థానంలో ఉన్న గురువుతో పరి వర్తన చెందడం వల్ల ఈ రాశివారు ప్రేమలో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి శని అధిపతి అయినందువల్ల మొదట్లో వీరి ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగినప్పటికీ, ఆ తర్వాత వేగం పుంజుకుంటాయి. ప్రేమకు వీరు కట్టుబడి ఉంటారు. వీరి ప్రేమాయణం తప్ప కుండా పెళ్లికి దారి తీస్తుంది. సాధారణంగా బంధువర్గంలోని వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల, పైగా రాశినాథుడైన గురువుతో పరివర్తన చెందినందువల్ల వీరికి తప్పకుండా ఫిబ్రవరి ప్రారంభంలోనే ప్రేమ యోగం పడుతుంది. ప్రేమ భాగస్వామితో వీరు చిత్తశుద్దితో, నీతి నిజాయతీలతో వ్యవహరిస్తారు. సాధారణంగా స్నేహితులు, బంధువుతో ప్రేమలో పడే అవకాశం ఉంది. విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రేమ భాగస్వామికి అనేక విధాలుగా కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. సంప్రదాయబద్దంగా పెళ్లి జరుగుతుంది.