ఢిల్లీలోని మండీ హౌస్‌లోని శ్రీరామ్ సెంటర్‌లో శనివారం (జనవరి 18) 'మై నేమ్ ఈజ్ జాన్' సోలో మ్యూజికల్ ప్లే షోను నిర్వహించారు. 'గ్రామోఫోన్ గర్ల్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటి, సంగీత విద్వాంసురాలు గౌహర్ జాన్ జీవిత కథ ఆధారంగా ఈ సంగీత నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
My sanction is Jaan Musical Play
‘గ్రామోఫోన్ గర్ల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన దివంగత నటి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు ‘గౌహర్ జాన్’ జీవిత కథ ఆధారంగా ‘మై నేమ్ ఈజ్ జాన్’ అనే సోలో మ్యూజికల్ ప్లే శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని మండీ హౌస్‌లోని శ్రీరామ్ సెంటర్‌లో ఈ సంగీత నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ‘గౌహర్ జాన్’ గా ప్రముఖ నటి అర్పితా ఛటర్జీ అద్భుతంగా నటించారు. గౌహర్ జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను తెరపైకీ తీసుకొచ్చారు. ఈ సంగీత నాటక ప్రదర్శనకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌహర్ జాన్ వంటి దిగ్గజ కళాకారుల జీవితాన్ని ఇంత అందంగా చూపించినందుకు నటి అర్పితా ఛటర్జీని ప్రత్యేకంగా అభినందించారు. గత కొన్నేళ్లుగా మన ప్రభుత్వం భారతదేశ కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టిందని, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ‘ఇంకా ఇలాంటి షోలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను. భారతదేశపు ప్రఖ్యాత నటి గౌహర్ జాన్ జీవితాన్ని స్ఫురించిన అర్పితా ఛటర్జీ సోలో పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. నేను అర్పితా జీని అభినందిస్తున్నాను. ఆమె భవిష్యత్తుతో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను’ అని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పుకొచ్చారు.
ఈ నాటకానికి అవంతిక చక్రవర్తి దర్శకత్వం వహించగా, జాయ్ సర్కార్ సంగీతం అందించారు. ఈ ప్రదర్శనను చూడటానికి వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఈ ప్రదర్శనను చాలా ప్రశంసించారు. అర్పితా ఛటర్జీ నటనను కొనియాడారు. ఈ నాటకాన్ని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు అర్పితా ఛటర్జీ పవర్ ఫుల్, చురుకైన నటనను మెచ్చుకున్నారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కూడా ఇందులో చేర్చారు. అర్పితా తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రగతి నటన చాలా అందంగా ఉందన్నారు. కథ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆమె దానిని ప్రదర్శించిన విధానం అద్భుతంగా ఉందన్నారు ఆడియెన్స్.ఈ నాటకాన్ని స్టూడియో 9 నిర్మించింది. దేశ విదేశాల్లో ఈ నాటకం ప్రదర్శనలు జరిగాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి