Mystery Black Balls: సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బాల్స్.. ఆరా తీయగా..

1 hour ago 1

ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్ర తీర ప్రాంతాల్లో నల్లటి రంగులోని మిస్టరీ బాల్స్ (Mystery Black Balls) కలకలం సృష్టించాయి. దాదాపు 2000కు పైగా నల్లటి ఆకారంలోని బంతులు మంగళవారం నుంచి సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. గతంలో ఎప్పుడూ స్థానికులు ఎవరూ ఇలాంటి మిస్టరీ బాల్స్‌ను చూడలేదు. మిస్టరీ బాల్స్‌తో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన చెందారు. దీంతో సిడ్నీలోని 8 బీచ్‌లకు సందర్శకుల ఎంట్రీని ఆపేశారు. బీచ్‌లలో పర్యాటకులు ఎవరూ స్విమ్మింగ్ చేయడకుండా ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున క్లీనింగ్ డ్రైవ్ చేపట్టి.. మిస్టరీ బాల్స్‌ను తొలగించారు.

బీచ్‌ల నుంచి సేకరించిన మిస్టరీ బాల్స్‌ను స్థానిక అధికారులు ల్యాబరేటరీ పరీక్షలకు పంపారు. పరీక్షల్లో క్లీనింగ్, కాస్మొటిక్స్‌ ఉత్పత్తుల్లో వాడే రసాయనాలు, ఫ్యాటీ యాసిడ్స్, ఇతర ఆయిల్స్‌తో కలిసి ఈ మిస్టరీ బాల్స్ ఏర్పడినట్లు నిర్థారించారు. దీంతో బీచ్‌లలో స్విమ్మింగ్‌కు శనివారం నాటి నుంచి అనుమతిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి పెద్దగా హానికలించవని నిర్ధారణ కావడంతో.. బీచ్‌లో స్విమ్మింగ్ చేసేందుకు అనుమతిస్తున్నట్లు న్యూ సౌత్ వేల్స్ మేరీటైమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ హట్చింగ్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ నల్లటి బంతులను ఉద్దేశపూర్వకంగా టచ్ చేయొద్దని సందర్శకులను సూచించారు. ఈ బంతులు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై ల్యాబరేటరీ టెస్టింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఇవి ఎక్కడి నుంచి ఇక్కడి తీరానికి కొట్టుకొచ్చాయన్న అంశంపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముందని తెలిపారు.

సిడ్నీ బీచ్‌లకు కొట్టుకొచ్చిన బ్లాక్ బాల్స్..

Mysterious achromatic balls washed up connected Coogee Beach successful Sydney, Australia. The formation was closed, and visitors kept retired portion experts analyse the balls to fig retired what they are. The formation volition enactment unopen until they cognize more. pic.twitter.com/1A04Y9nVxA

— Tom Valentino (@TomValentinoo) October 16, 2024

సిడ్నీ బీచ్‌‌లకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి బీచ్‌లలోని క్లీన్ వాటర్ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ కథనాలు చదవండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article