Pan card loan: పాన్ కార్డుపై రుణం అవకాశం.. ఆ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

4 hours ago 1

పర్మినెంట్ అక్కౌంట్ నంబర్ కార్డునే క్లుప్తంగా పాన్ కార్డు అంటారు. దీన్ని ఆదాయపు పన్ను శాఖ మంజూరు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు. ఆర్థిక లావాదేవీలన్నింటికీ అది కీలకంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారందరూ తప్పనిసరిగా ఈ కార్డు తీసుకోవాలి. మిగిలిన వారికి కూడా బ్యాంకు ఖాతాల ప్రారంభం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో అవసరమవుతుంది. ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా అత్యంత అవసరమైన డాక్యుమెంట్. దీనిపై బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు, కొన్ని డిజిటల్ యాప్ లు లోన్లు మంజూరు చేస్తాయి. ముందుగా వాటిని గుర్తించాలి. రుణంపై వడ్డీ రేటు, వాయిదాల చెల్లంచే కాలపరిమితిని గమనించాలి. తక్కువ వడ్డీతో ఎక్కువ కాలపరిమితికి రుణాలిచ్చే సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి.

ముందుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రుణదాత వెబ్ సైట్ లో లేదా స్వయంగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు అందజేయవచ్చు. అప్లికేషన్ లో మీ క్రెడిట్ స్కోర్, లోన్ వివరాలు, ఇతర సమాచారం పూర్తి చేయాలి. గుర్తింపు రుజువు కోసం మీ పాన్ కార్డును అప్ లోడ్ చేయాలి. కొన్నిసార్లు ఆధార్ కార్డును అడిగే అవకాశం ఉంది. మీరు అందించిన దరఖాస్తును ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పరిశీలిస్తాయి. ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ను చూస్తాయి. అది మెరుగ్గా ఉంటే మీకు వెంటనే రుణం మంజూరవుతుంది. క్రెడిట్ చరిత్ర సక్రమంగా లేకుండా మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం కూాడా ఉంటుంది. బ్యాంకు మీ దరఖాస్తును ఆమోదించి, రుణం మంజూరు చేస్తే కొన్ని గంట్లలోనే మీ ఖాతాలో జమఅవుతుంది.

వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉన్న సంస్థల నుంచే రుణం తీసుకుంటే మంచిది. దీనితో పాటు చెల్లించే గడువు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు స్టేట్ మెంట్లు ఇవ్వాలని కోరతాయి. అదనంగా ష్యూరిటీ ఇస్తే రుణ మొత్తాన్ని పెంచేందుకు కూడా అంగీకరిస్తాయి. పాన్ కార్డుపై తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి. లేకుండా ఆలస్య చెల్లింపు చార్జీలు విధిస్తారు. అత్యవసర సమయంలో తక్కువ మొత్తంలో రుణం పొందటానికి పాన్ కార్డు ఉపయోగంగా ఉంటుంది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article