తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. కొత్త ఓటరు జాబితా ఇప్పటికే సిద్ధమైంది. అలాగే కుల గణన సైతం పూర్తైంది. దీంతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై సంకేతాలు ఇచ్చారు.
Revenue Minister Ponguleti Srinivas Reddy
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణలో కులగణన రిపోర్ట్ వచ్చేసింది. నెక్ట్స్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అతి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని.. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల కోసం క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది హస్తం పార్టీ. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. గ్రామాల్లోని పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు రానివాళ్లు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని తెలిపిన మంత్రి.. అందరికీ న్యాయం చేయడమే కాంగ్రెస్ బాధ్యత అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..