తమ పిల్లలు అందరికన్నా ముందుండాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తపన పడుతుంటారు. అయితే, దీనిని సాధ్యం చేయాలంటే అందుకు పునాదులు చిన్నతనంలోనే పడాలి. ఇప్పుడు మీరు నేర్పే అలవాట్లే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకు వారి వ్యక్తిత్వాన్ని ఇప్పటి నుంచే తీర్చిదిద్దాలి. ఎవరు ఏ చిన్న సాయం చేసిన వారికి కృతజ్ఞత తో ఉండటం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. ప్రతి ఉదయం జీవితంలో మరో కొత్త రోజును జీవించే అవకాశం దొరికినందుకు సంతోషంతో నిద్రలేవాలనే విషయాన్ని వారికి తెలియజేయాలి. ఇది వారిలో పాజిటివ్ యాటిట్యూడ్ ను అలవడేలా చేస్తుంది. దీంతో పాటు ఈ 5 విషయాలపై పేరెంట్స్ ఫోకస్ చేయాలి.
ఉదయం ఏం తింటున్నారు.. ?
పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ కావాలని మారాం చేస్తుంటారు. కానీ ప్రతి ఉదయం మొదట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మాత్రం కచ్చితంగా పోషకాలతో నిండినదై ఉండేలా చూసుకోవాలి. అది వారి బాడీని, బ్రెయిన్ ను రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. వారి ఫోకస్ ను అమాంతం పెంచుతుంది. నూనెలో వేయించిన పదార్థాలు తింటే పిల్లలు రోజంతా డల్ గా ఉంటారు. స్కూల్లో పాఠాలు వినే టైంలో నిద్ర వారిని ఆవహిస్తుంటుంది.
చిన్న పాటి కసరత్తులు అవసరమే..
రోజూవారి వ్యాయామాలు పెద్దలకే కాదు చిన్న పిలలకు కూడా అవసరమే. చిన్నపాటి స్ట్రెచింగ్స్, లైట్ ఎక్సర్ సైజులు వారితో చేయించడం వల్ల ఇది వారిని పాజిటివ్ గా ఉంచే మరో అంశం.
ఆత్మవిశ్వాసం నింపుతున్నారా?
పిల్లలు చిన్నప్పుడు ఎదుర్కునే కొన్ని పరిస్థితులు వారి పట్ల వారికే తక్కువ భావన కలిగేలా చేస్తుంటాయి. అందుకే ప్రతి రోజు వారిలో కొంత ఆత్మవిశ్వాసం నూరిపోస్తుండాలి. అందుకు వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. నేను ఎందులోనూ తక్కువ కాదు.. ఏదైనా సాధించగలను అనే మాటలనే మంత్రాలుగా వారి మెదడుకు ఎక్కించాలి. అది పెద్దైన తర్వాత కూడా వారిని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
మెడిటేషన్ మరువొద్దు..
మెడిటేషన్ కు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. ధ్యానం చేసే పిల్లలకు ఇతరులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మానసిక పరిపక్వత మెల్లిగా డెవలప్ అవుతుంది. అందుకోసం రోజులో కొంత సమయం వారు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేలా చిన్న చిన్న విషయాలు అలవాటు చేయాలి.
ఇవి కూడా అవసరమే..
పిల్లలో క్రియేటివిటీకి పదును పెట్టే విషయాలను నేర్పాలి. వారికి కథలు చెప్పడం, చిన్న చిన్న కథలు రాసేలా ప్రోత్సహించడం చేయాలి. ఫోన్ వాడే సమయాన్ని తగ్గించి ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేలా చూడాలి. వారికి చిన్ననాటి నుంచే మంచితనం అలవాటు చేయాలి. ఇతరుల పట్ల సానుభూతి చూపడం తెలపాలి. వారి రోజును వారే ఆర్గనైజ్ చేసుకునేలా ప్రోత్సహించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)