పల్లీలు.. వేరుశనగలు.. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు.. ఘుమఘుమలాడే పులిహోరలో గుప్పెడు పల్లీలు వేసుకుంటే.. ఆ రుచే వేరు.. అంతేకాదు.. పల్లీలతో బ్రేక్‌ఫాస్ట్‌లోకి చట్నీ, టమాటా పచ్చడి, కొన్ని రకాల ఫ్రైలు కూడా చేస్తుంటారు. ఇకపోతే, ప్రయాణాల్లో వీటి అవసరం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. మంచి టైమ్‌పాస్ తినుబండారం పల్లీలు.. అంతేకాదు.. పల్లీలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాదాపు అందరికీ తెలిసిందే. అయితే, ఈ పల్లీలను వేయించి, తినటం కంటే ఉడికించి తినటం వల్ల రెట్టింపు ప్రయోజనం అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
పల్లీలు ఉడికించి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఉండే అధిక ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ కడుపుకు సంతృప్తినిచ్చి, అధిక ఆకలిని అడ్డుకుంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి.
అంతేకాదు, పల్లీలని ఉడికించి తినడం షుగర్ బాధితులకు కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. ఇందులో మెగ్నీషియం ఇన్సులిన్ చర్యని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సాయపడుతుంది. ఇందులో నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. కాబట్టి, వీటిని ఉడికించి తినడం చాలా మంచిది.
ఇవి కూడా చదవండి
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉడికించిన వేరుశనగల్లో మెండుగా ఉంటాయి. నాడీ వ్యవస్థకు సహాయపడి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. వేరుశెనగలను ఉడకబెట్టినప్పుడు, బయోయాక్టివ్ సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్స్, సెలీనీయం, మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..