కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులకు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ స్కీమ్‌లో రైతులు ఏడాదికి రూ.6000ను అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం డబ్బులు ఇప్పటి వరకు 18వ విడత అక్టోబర్ 05, 2024న విడుదల కాగా, ఇప్పుడు 19వ విడత రానుంది. దీని కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
19వ విడత వచ్చేది అప్పుడే..
ఇక 19వ విడత ఫిబ్రవరి 2025 చివరి వారంలో రైతుల ఖాతాలో జమయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని నిర్ధారించనప్పటికీ, పీఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందిస్తుంది. 2025 ఫిబ్రవరి చివరి నాటికి 19వ విడత లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల తెలిపారు.
ఇవి కూడా చదవండి
పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల కోసం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలా?
➦ ముందుగా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి https://pmkisan.gov.in.
➦ హోమ్‌పేజీలోని ‘లబ్ధిదారుల స్థితి’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
➦ అక్కడ మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను అందించండి.
➦ వివరాలను సమర్పించిన తర్వాత మీ వాయిదా స్థితి కనిపిస్తుంది.
పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త రైతులు పీఎం కిసాన్ కోసం ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCs) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలో చూద్దాం..
➦ ముందుగా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
➦ ‘కొత్త రైతు నమోదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
➦ అక్కడ ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత/బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
➦ ఫారమ్‌ను సమర్పించి ఒక కాపీని సేవ్ చేసుకోండి.
➦ దరఖాస్తును సమర్పించిన తర్వాత ఆమోదం పొందే ముందు స్థానిక అధికారులు దానిని ధృవీకరిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి