గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ తో బాలయ్య సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక సినిమాలతో పాటు బాలకృష్ణ టాక్ షో కూడా అదరగొడుతున్నారు. ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4తో అదరగొడుతుంది. ఇప్పటికే సీజన్ 4కి చాలా మంది గెస్ట్ లు వచ్చి ఆకట్టుకున్నారు.
ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
బాలకృష్ణ గెస్ట్ లతో చేసే సందడి అంతా ఇంతా కాదు. బాలయ్య అడిగే చిలిపి ప్రశ్నలకు.. స్టార్స్ చెప్పే క్రేజీ సమాదానాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు తాజాగా బాలకృష్ణ షో కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో చరణ్ బాలయ్య మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి.
ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
బాలయ్య రామ్ చరణ్ ను ఓ ఆట ఆడుకున్నారు. రామ్ చరణ్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తో పాటు ఆయన స్నేహితులు శర్వానంద్, విక్రమ్ హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ కు చరణ్ ఫోన్ చేసి మాట్లాడటం అన్నింటికంటే హైలైట్. అలాగే రామ్ చరణ్ సేవ గుణం గురించి కూడా బాలకృష్ణ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే చరణ్ తన అభిమాని ఒకరు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని తెలుసుకొని ఆయనకు సాయం చేశారు. తన అభిమాని భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని రామ్ చరణ్ వెంటనే ఆయనకు సాయం చేశారు. తన భార్య ఉపాసనతో పాటు, చరణ్ హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో ఆమెకు ఉచిత వైద్య చికిత్సను ఏర్పాటు చేశారు. మొదట్లో హాస్పిటల్ బిల్లుల గురించి ఆందోళన చెందిన అభిమాని, రామ్ చరణ్, ఉపాసన అంతా చూసుకుంటామని తెలిపిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఆ అభిమాని బాలకృష్ణ షోలో తన ఎమోషన్ ను, చరణ్ చేసిన సాయాన్ని పంచుకున్నాడు. అలాగే ఆ అభిమానికి లక్షరూపాయల చెక్ ను కూడా అందించారు రామ్ చరణ్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి