బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కొన్ని నెలలుగా హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. అతడిని చంపేస్తామని.. లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు కాల్స్, లేఖలు రావడంతో ముంబై పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. దీంతో సల్మాన్ ఖాన్ తోపాటు మరికొందరు స్టార్స్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులకు పాల్పడిన నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని వర్లీ పోలీసులు నిందితులను బాంద్రా ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడు ఆజం మహ్మద్ ముస్తఫా సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించాడు.
సల్మాన్ ఖాన్ ను బెదిరించిన నిందితులకు ఎవరైనా సపోర్ట్ చేశారా.. ? వీరికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీని చంపుతానని బెదిరించిన 20 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. జీషాన్ సిద్ధిఖీని ఫోన్‌లో బెదిరించే సమయంలో సల్మాన్ ఖాన్ గురించి కూడా ప్రస్తావించాడు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.09 గంటలకు వర్లీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని ఫోన్ చేసి రూ.2 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో నిందితులపై వర్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుడి ఫోన్ నంబర్ సీడీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమాచారం ఆధారంగా నిందితుడు ఉంటున్న ప్రదేశంలో రహస్య నిఘా పెట్టారు. అనంతరం నిందితుల పూర్తి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అలాగే, నిందితుడిని బాంద్రా ప్రాంతంలో అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా.. రేపటి వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.