టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో సామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ ఇటీవల తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పికిల్‌బాల్ టోర్నమెంట్ కి సంబందించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పికిల్‌బాల్ ఆటగాళ్లతో కలసి సరదాగా గడిపిన క్షణాలను అందులో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండడం గమనార్హం. సమంత, రాజ్‌లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గతంలో రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్: హనీ బానీ’ సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడందని తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సమంత ఇటీవల ‘పికిల్‌బాబ్ టోర్నమెంట్’లో పాల్గొంది. ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కనిపించడంంతో మరోసారి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని, దీంతో సామ్ తెగ సిగ్గుపడిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. కాగా రాజ్‌కి ఇప్పటికే పెళ్లయింది. అతను శ్యామాలి డేని వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత..
రాజ్ నిడిమోరు విషయానికి వస్తే.. గతంలో ఎపిసోడ్లకు స్క్రీన్ ప్లే రాసేవాడు. ఆ తర్వాతసమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్2’కు దర్శకత్వం వహించాడు. దీంతో పాటు ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘ఫర్జీ’ మరికొన్ని వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘రక్త బ్రహ్మాండం’ అనే వెబ్ సిరీస్‌కి ఆయనే నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
హనీ బన్నీ.. సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో సమంత, రాజ్ నిడిమోరు..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి