సమాజంపట్ల సరైన అవగహన కలిగివుండాలని, పౌరులు తమ పాత్రను, బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. సమస్యల నుంచి పారిపోవద్దని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చేయాలని ఆయన సూచించారు. సమతా కుంభ్ 2025,108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు మూడో రోజు శ్రీ రామానుజ విజ్ఞాన వేదిక కార్యక్రమంలో వివిధ కాలేజీ విద్యార్థులతో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడారు. ఆధ్యాత్మికత అంటే మన జీవన విధానంలో ఇమిడి ఉండేదని, ప్రతి ఒక్కరిలో ప్రతి అంశంలో దైవత్వాన్ని చూడడం అనేది మన ఆలోచన పరిపక్వతను చాటుతుందని చిన్న జీయర్ స్వామి అన్నారు.
శ్రీ రామానుజం చూపిన మార్గం అందరికీ ఆదర్శమని రామానుజ విజ్ఞాన వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ విశ్వనాథం అన్నారు. కార్యక్రమంలో కాలేజీ, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
సూపర్ కంప్యూటర్ కంటే వేగవంతమైన మహిళ శకుంతల అని.. ఇక్కడికి వచ్చిన పిల్లలు శకుంతలను మించిపోయారని చిన్నజీయర్ స్వామి అన్నారు. భగవద్గీతపై సమాధానాలు చెప్పిన విద్యార్థులకు స్వామివారు బహుమతులతో పాటు మంగళాశాసనాలు అందించారు.
వీడియో చూడండి..
వైభవంగా బ్రహ్మోత్సవాలు..
సమతా కుంభ్ -2025 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్‌స్వామి మార్గనిర్దేశంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో జరగబోయే కార్యక్రమాల్లో హనుమద్ వాహన సేవ ప్రధానమైంది. హనుమద్ వాహనంపై తరలిరానున్న 18 మంది దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు కొనసాగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..