హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యాడు. ఇక రీసెంట్‌గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు, శివకార్తికేయన్ కోలీవుడ్ బుల్లితెరపై అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. అతను హోస్ట్ చేసిన దిస్, జోడి వంటి షోలన్నీ తమిళనాడు అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శివకార్తికేయన్ మొదట చిన్న తెర నుండి పెద్ద తెరకు హాస్యనటుడిగా అరంగేట్రం చేశాడు.
2012లో పాణిరాజ్ దర్శకత్వం వహించిన మెరీనా చిత్రంతో శివకార్తికేయన్ వెండితెరపై అడుగుపెట్టాడు. అందులో ఆయన నటించినప్పటికీ, పసంగ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆ తర్వాత, ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన 3వ చిత్రంలో ధనుష్ స్నేహితుడిగా శివకార్తికేయన్ నటించారు.తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
తమిళ సినిమాల్లో నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా ప్రతిభను చాటుకున్నాడు శివకార్తికేయన్. హాస్య చిత్రాలలోనే కాకుండా సెంటిమెంట్ చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. శివకార్తికేయన్ నటించిన డాక్టర్, మావీరన్, అమరన్ చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. తాజాగా శివకార్తికేయన్ ఇటీవల చేసిన ఒక ప్రకటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా తాను సోషల్ మీడియాను ఉపయోగించడం మానేశానని, సోషల్ మీడియాను ఉపయోగించడం మానేసినప్పటి నుండి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నానని అన్నారు. ఆ అలవాటు మనుకోవడంతో చాలా మార్పులు వచ్చాయి అని శివకార్తికేయన్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి