Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..

2 hours ago 1

Flipkart large buying Utsav: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొన్నటి వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌తో యూజర్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ పేరుతో మరో కొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఇంతకీ ఏంటా స్మార్ట్ ఫోన్స్‌.? ఎలాంటి డిస్కౌంట్ లభిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..

Motorola G85 5G: ఈ సేల్‌లో లభిస్తోన్న బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 3డీ పీఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

Realme P1 5G: రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రూ. 12,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Nothing Phone 2A: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్‌2ఏ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 20,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో నోటిఫికేషన్ ఇండికేటర్‌గా పనిచేసే, గ్లిఫ్‌ లైట్ను అందించారు. అలాగే మంచి నాణ్యతతో కూడిన కెమెరాను ఇందులో అందించారు.

Samsung Galaxy S23 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 39,999కి సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఈ ఫోన్‌ ఏఐ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Poco M6 5G: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి పోకో ఎమ్‌6 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 7200కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article