ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడీ రియల్ హీరో. ముఖ్యంగా కరోనా కాలంలో ఎన్నో మంచి పనులు చేపట్టి అందరి మన్ననలు అందుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే ఇప్పుడు సోనూసూద్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. రూ.10 లక్షల మోసం కేసులో లూథియానా కోర్టు ఆ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని వల్ల వారు అరెస్టు భయంతో ఉన్నారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం చేశాడని లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా కోర్టులో కేసు వేశారు. క్రిప్టోకరెన్సీ పేరుతో ఈ మోసం జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విచారణ లూథియానా కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో సోను సూద్ సాక్ష్యం చెప్పాల్సి ఉంది. అయితే, పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ అతను కోర్టుకు హాజరు కాలేదు. ఈ కారణంగా కోర్టు నటుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ముంబై నివాసి సోను సూద్ కు సమన్లు జారీ అయ్యాయి. అయితే, అతను కోర్టుకు హాజరు కాలేదు. కాబట్టి అతనిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలి’ అని లూథియానా కోర్టు ముంబై పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది.
కాగా తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా సమన్లు జారీ చేసింది. ఇందుకు మా న్యాయవాదులు స్పందించారు. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరం. పబ్లిసిటీ కోసం నా పేరును వాడుకుంటున్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సోనూ సూద్ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి
సోనూ సూద్ ట్వీట్..
We request to clarify that the quality circulating connected societal media platforms is highly sensationalised. To enactment matters straight, we were summoned arsenic a witnesser by the Honourable Court successful a substance pertaining to a 3rd enactment to which we person nary relation oregon affiliation. Our lawyers…
— sonu sood (@SonuSood) February 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.